: ఐదంతస్తుల భవంతి నుంచి చెన్నై మెడికో తోసేసిన శునకం బతికే ఉంది!
కొన్ని రోజుల క్రితం చెన్నైలో ఓ మెడికో ఐదంతస్తుల భవంతి నుంచి ఓ శునకాన్ని విసిరేసి పైశాచిక ఆనందాన్ని పొందిన విషయం తెలిసిందే. చెన్నై మెడికో గౌతమ్ కుక్కను భవనంపై నుంచి విసిరేస్తుండగా ఆ దృశ్యాలు వీడియో తీసి మరీ ఫేస్బుక్లో పెట్టాడు. వీడియో దేశమంతటా పాకి ఈ ఘటన వెలుగులోకొచ్చింది. అయితే ఆ శునకం స్వల్పగాయాలతో బయటపడిందట. గౌతమ్ కిందకు విసిరేయడంతో కాలి గాయంతో బాధపడుతోన్న ఆ శునకాన్ని కార్తీక్ దండపాణి, శ్రవణ్ అనే ఇద్దరు వ్యక్తులు కాపాడారు. ప్రస్తుతం ఆ శునకానికి చికిత్స చేయిస్తున్నామని కార్తీక్ తెలిపారు. శునకం పట్ల కనికరం లేకుండా ప్రవర్తించిన వ్యక్తి కోసం గాలిస్తోన్న పోలీసులకు ఫేస్బుక్లో ఈ వీడియో చూసిన నిందితుడి క్లాస్మేట్ తనకు గౌతమ్ తెలుసని సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గౌతమ్‌ను అరెస్టు చేశారు.