: కృష్ణా డెల్టాకు ఢోకా లేదిక!... పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసిన చంద్రబాబు!


కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కృష్ణా డెల్టాకు ఈ ఏడాది కూడా ఇబ్బంది లేనట్టే. గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా డెల్టా రైతులకు పుష్కలంగా నీరందనుంది. నిరుటిలానే డెల్టా పొలాల్లో సిరులు పండనున్నాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పట్టిసీమ ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గోదావరి నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేశారు. ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాణిక్యాలరావులతో కలిసి పట్టిసీమ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు నీటిని విడుదల చేశారు.

  • Loading...

More Telugu News