: ఎడెన్ విమానాశ్రయ ఆవరణలో వరుస కారు బాంబు పేలుళ్లు


ప్ర‌పంచ వ్యాప్తంగా దాడుల‌తో అల‌జ‌డి రేపుతోన్న ఉగ్ర‌వాదులు ఈరోజు ఉద‌యం యెమెన్‌లోని ఎడెన్‌లో రెచ్చిపోయారు. అక్క‌డి విమానాశ్రయం ఆవరణ కారు బాంబు పేలుళ్ల శ‌బ్దాల‌తో దద్ద‌రిల్లింది. వరుస కారు బాంబు పేలుళ్లతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, ప‌లువురికి గాయాల‌య్యాయి. ఎడెన్‌లోని విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న మిలిటరీ బేస్ ల‌క్ష్యంగా ఈ దాడులు జ‌రిపారు. దాడుల‌కి పాల్ప‌డింది ఏ ఉగ్ర‌వాద సంస్థ అనే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కారు బాంబు పేలుళ్ల‌తో విమానాశ్ర‌య ఆవ‌ర‌ణ‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను పెంచారు. క‌ట్టుదిట్టంగా త‌నిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News