: శ్రీనగర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ఉద్రిక్తత
శ్రీనగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాశ్మీరి పండిట్లకు, సైనికులకు ప్రత్యేక కాలనీ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఉదయం వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరవేస్తూ రోడ్లపైకి వచ్చారు. పాకిస్థాన్, ఇస్లామిక్ స్టేట్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించారు. వేర్పాటు వాద పార్టీల ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.