: రైతన్న బాగుంటేనే సమాజం భద్రం!: టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు


టెలీ కాన్ఫరెన్స్ లో భాగంగా నేటి ఉదయం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజం భద్రంగా ఉండాలంటే రైతులు బాగు పడాలని ఆయన వ్యాఖ్యానించారు. రోజూ మాదిరే నేటి ఉదయం పలు శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల అధికార యంత్రాంగంతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. రైతుల రుణ మాఫీ కోసం ఇప్పటికే రూ.24 వేల కోట్లను విడుదల చేశామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా గతేడాది రాష్ట్రంలో 139.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలు పండాయన్నారు. ఈ దిగుబడిని ఈ ఏడాది 180 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పశుపోషణలో నెలకు రూ.10 వేల మేర ఆదాయాన్ని ప్రతి రైతు కుటుంబం ఆర్జించాలన్నారు. సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహమిస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News