: ఆహ్వానం అందినా ‘విస్తరణ’కు హాజరు కాని అద్వానీ!... సోదరికి అనారోగ్యంతో ముంబైకి పరుగు!


రాష్ట్రపతి భవన్ లో నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులతో పాటు బీజేపీ ముఖ్య నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. అయితే ఈ ఆహ్వానాలు అందిన వారి జాబితాలోని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ) ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సుష్మా గైర్హాజరీకి కారణాలు వేరేగా ఉన్నా... అద్వానీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. ముంబైలో ఉంటున్న అద్వానీ సోదరి షీలా ఆరోగ్యం నిన్న ఆకస్మికంగా విషమించిందట. దీంతో ఆమెను అక్కడి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అద్వానీ ఉన్నపళంగా ఢిల్లీలో ముంబై ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఆహ్వానం అందినా అద్వానీ కేబినెట్ విస్తరణకు హాజరుకాలేకపోయారు.

  • Loading...

More Telugu News