: కేంద్రానిదీ తెలంగాణ మాటే!... రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా ప్రకటన!


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెలవంక దర్శనంతో ముగుస్తుంది. వాస్తవానికి నిన్ననే నెలవంక దర్శనం ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రకారం నేడే ఈద్ ఉల్ ఫితర్’ పండుగను ముస్లింలు జరుపుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ సెలవు కూడా నేడే. అయితే నెలవంక కనిపించని కారణంగా ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం రేపు అని ఢిల్లీలోని జామా మసీదు మత పెద్ద ప్రకటించారు. దీంతో వేగంగా స్పందించిన తెలంగాణ సర్కారు ఈద్ ఉల్ ఫితర్ పండుగ రేపు అని ప్రకటించింది. నేటి సెలవును రద్దు చేస్తూ... రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా ప్రకటించింది. నేడు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా కాస్తంత ఆలస్యంగా తెలంగాణ సర్కారు ప్రకటించినట్లుగానే నేటి సెలవును రద్దు చేసేసింది. రేపు, ఎల్లుండిని సెలవు దినాలుగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News