: అలకబూనిన సుష్మా!... కేబినెట్ లోకి ఎంజే అక్బర్ ఎంట్రీనే కారణమట!


నిన్నటి కేంద్ర కేబినెట్ విస్తరణ రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లోని మంత్రులు, బీజేపీ నేతలంతా దాదాపుగా హాజరయ్యారు. అయితే మోదీ కేబినెట్ లో కీలక శాఖ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ మాత్రం అక్కడ కనిపించలేదు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన హంగేరీ విదేశాంగ శాఖ మంత్రి సమావేశం కారణంగానే తాను కేబినెట్ విస్తరణకు రాలేకపోయానని సుష్మా... తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే ఆమె గైర్హాజరీకి అదొక్కటే కారణం కాదని, కేబినెట్ లోకి కొత్తగా తీసుకుంటున్న నేతల పేర్లను తెలుసుకున్న మీదట ఆమె అలకబూనారన్న వాదన వినిపిస్తోంది. నిన్నటి విస్తరణలో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ ను మోదీ తన కేబినెట్ లోకి చేర్చుకున్నారు. అక్బర్ ను విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా మోదీ నియమించారు. దీంతో తనకు చెక్ పెట్టేందుకే మోదీ... ఎంజే అక్బర్ ను తన శాఖకు తీసుకువచ్చారని సుష్మా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె నిన్నటి కేబినెట్ విస్తరణకు హాజరుకాలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News