: నారా లోకేశ్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలి!... ముస్లిం మత పెద్దల ఆశీర్వచనం!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం పలికారు. ఈ మేరకు నిన్న గుంటూరు నగరంలో టీడీపీ నేత మద్దాళి గిరిధర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన నారా లోకేశ్ కు అక్కడి ముస్లిం మత పెద్దలు దీవెనలు అందజేశారు. ఈ విందుకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. విందు ప్రారంభానికి ముందే అక్కడికి చేరుకున్న లోకేశ్ ఆసాంతం అక్కడే గడిపారు. ముస్లింలతో కలిసి విందారగించారు. ఈ సందర్భంగా ఆయన వద్దకు వచ్చిన ముస్లిం మత పెద్దలు... రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయనను ఆశీర్వదించారు.