: ప్రియాంక ప్రచార బాధ్యతలు తీసుకున్నారన్న వార్తలన్నీ అవాస్తవం: గులాంనబీ ఆజాద్


2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా ప్రియాంక గాంధీని రంగంలోకి దించారంటూ గత రెండు రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఖండించారు. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ప్రియాంక గాంధీని నియమించారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీకి ఆ బాధ్యతలు అప్పగించారని ఎవరైనా చెప్పి ఉంటే అది పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు. మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఆమె యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకుని ఉంటే... యూపీలో పార్టీ పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News