: సుష్మ తప్పించుకుందని వార్తలు రాయకండి: మీడియాకు సుష్మా స్వరాజ్ చురక
కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ మీడియాకు చురకలంటించారు. హంగేరీ విదేశాంగ శాఖా మంత్రితో సమావేశం ఉండడం వల్ల నూతన మంత్రి వర్గ ప్రమాణస్వీకారానికి తాను హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే ట్విట్టర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపిన సుష్మా స్వరాజ్, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోతున్నానని ట్వీట్ చేశారు. దీనిని అవకాశంగా తీసుకుని మీడియా సంస్థలు తాను నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా తప్పించుకున్నానని వార్తలు రాయవద్దని ఆమె సూచించారు.