: సమర్థుడికి కోచ్ పగ్గాలు అప్పగించడం ద్వారా బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుంది!: మెక్ గ్రాత్
బీసీసీఐ గొప్ప నిర్ణయాన్ని తీసుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ తెలిపాడు. టీమిండియా క్రికెట్ కోచ్ గా టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. సమర్థుడికి కోచ్ గా పగ్గాలు అప్పగించడం అభినందించదగ్గ విషయమని ఆయన తెలిపాడు. కోచ్ పదవికి బ్యాట్స్ మన్, బౌలర్ అనే తేడా ఉండదని, అయితే బౌలర్ అయితే జట్టుకు లాభిస్తుందని మెక్ గ్రాత్ చెప్పాడు. టీమిండియా చీఫ్ కోచ్ గా పోరాట యోధుడైన మంచి వ్యక్తికి పగ్గాలు అప్పగించడం జట్టుకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలర్ గా భారత్ కు విశిష్ట సేవలందించిన అనిల్ కుంబ్లే, కోచ్ గా రాణిస్తాడనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని మెక్ గ్రాత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.