: రంగంలోకి దిగిన రష్యా విమాన వాహక భారీ యుద్ధనౌక... ఐఎస్ఐఎస్ కు మూడినట్టే!


ప్రపంచాన్ని వణికించేందుకు సిద్ధమైన ఐఎస్ఐఎస్‌ పనిపట్టడానికి రష్యా సిద్ధమవుతోంది. ఇరాక్ లోని ఫలూజా పట్టణ విముక్తిలో అమెరికా సంకీర్ణ దళాలు కీలక పాత్ర పోషించగా, ఐఎస్ఐఎస్‌ ను తుదముట్టించేందుకు రష్యా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌక అడ్మిరల్‌ కుజనెత్సోవ్‌ ను రష్యా రంగంలోకి దించింది. రష్యా దగ్గరున్న యుద్ధ నౌకల్లో 55 వేల టన్నుల బరువు, 305 మీటర్ల పొడవుతో అతిపెద్దదైన అడ్మిరల్ కుజనెత్సోవ్ లో రష్యా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు ఉంటాయి. ఈ యుద్ధ నౌకపై 30 యుద్ధ విమానాలు, క్షణకాలంలో బాంబుల వర్షం కురిపించే సామర్థ్యం ఉన్న 30 హెలీకాఫ్టర్లను కూడా మోహరిస్తున్నారు. దీనిని మధ్యదరా సముద్రంలో మోహరించి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై దాడులకు దిగనుంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లలో పేలుళ్లకు పాల్పడి, భయోత్పాతం కలిగించడం ద్వారా ప్రపంచం దృష్టిని మరోసారి ఐఎస్ఐఎస్ ఆకర్షించింది. దీంతో ఐఎస్ఐఎస్ ఆగడాలు కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలంటే దానిని తుదముట్టించడం ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా రంగంలోకి దిగడం విశేషం.

  • Loading...

More Telugu News