: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ మళ్లీ సోదాలు
హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ మళ్లీ ఈరోజు సోదాలు నిర్వహించింది. పాతబస్తీలోని తలాబ్‌కట్టా, బార్కాస్ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. పాతబస్తీలో పట్టుబడి కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ ఈ తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా అధికారులు 17 బుల్లెట్లు, 2 కంప్యూటర్లు, 2 స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి రాబట్టిన సమాచారంతో మరోవైపు నాందేడ్‌లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అక్కడ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.