: గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ 'యాడ్స్' విషయంలో కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు


ప్రముఖ సెర్చ్ ఇంజన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహులలో వచ్చే యాడ్స్ పై ఆ సంస్థలకు, వాటిపై నియంత్రణ లేదన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. పుట్టబోయే బిడ్డ లింగ నిర్థారణ కిట్లు, పరీక్షలు, క్లినికల్ సేవలకు సంబంధించిన ప్రకటనలపై సాబు మాథ్యూ జార్జ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం...సెర్చ్ ఇంజన్లు చట్టాలను ఉల్లంఘిస్తే పట్టించుకోరా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రకటన కర్తలు, వినియోగదారులకు మధ్య తాము అనుసంధాన కర్తలము మాత్రమేనని, ప్రకటనలను పూర్తిగా నియంత్రించలేమని సెర్చ్ ఇంజన్ల తరపు న్యాయవాదులు సుప్రీంకు తెలిపారు. ఇలాంటి యాడ్స్ వద్దనుకునేవారు వాటిని అడ్డుకోవచ్చని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వారి వాదనలను ఖండించిన సుప్రీంకోర్టు, చట్టప్రకారం నిషేధం ఉన్న ప్రకటనలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించి, తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News