: మహేష్ బాబు చాలా క్లోజ్ అని చెప్పి బోల్తా కొట్టించిన మోసగాడు!


ఫేస్‌ బుక్‌ ను ఆయుధంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. యువతులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో పేరు చెప్పి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. శశి అనే వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తనకు చాలా సన్నిహితుడని, అతనిని కలిసేలా ఏర్పాటు చేస్తానని పలువురిని నమ్మించి ఫేస్‌ బుక్‌ ద్వారా మోసానికి పాల్పడ్డాడు. ఇతని బారిన పడిన బాధితుల్లో ఒకరు హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘరానా మోసంలో బాధితుడు ఎంత మొత్తం నష్టపోయాడన్న విషయం వెల్లడించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News