: నేను జర్మనీలో వుండగా ప్రమోషన్ గురించి మోదీ ఫోన్ చేసి చెప్పారు: ప్రకాశ్ జవదేకర్
తనకు క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తాను జర్మనీలో జరుగుతున్న పర్యావరణ సదస్సులో ఉండగా, మోదీ నుంచి ఫోన్ వచ్చిందని, విషయం చెప్పిన మోదీ, ఉన్నపళంగా బయలుదేరి ఢిల్లీకి రావాలని కోరారని, ఆ వెంటనే తన మిగతా కార్యక్రమాలను రద్దు చేసుకుని స్వదేశానికి ప్రయాణమైనట్టు జవదేకర్ వివరించారు. ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం పర్యావరణ శాఖ మంత్రిగా (ఇండిపెండెంట్ చార్జ్) ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు పార్టీ ఇన్ చార్జ్ గా వ్యవహరించి, తెలుగుదేశంతో కలిసి పార్టీని విజయపథంలో నడిపించిన వ్యక్తిగా, మోదీ కోటరీలో ప్రముఖుల్లో ఒకరిగా చేరిన జవదేకర్ కు ఇప్పుడిక క్యాబినెట్ హోదా లభించింది.