: రోడ్డును పట్టించుకోనందుకు... మున్సిపల్ ఇంజనీర్లను గుంతలోకి తోసేసిన గ్రామస్తులు!


కర్ణాటకలోని కొప్పాల్ గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొప్పాల్ గ్రామంలోని కోటే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి స్పందన ఉండడం లేదు. ఈ క్రమంలో మల్లప్ప అనే మాజీ సైనికుడు ఆ రోడ్డుపై వెళ్తుండగా, గుంతలో పడి గాయపడ్డాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇద్దరు మున్సిపల్ ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చారు. దీంతో తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన స్థానికులు వారిద్దరినీ ఆ గుంతలోకి తోసేశారు. వారు పైకి లేచేందుకు ప్రయత్నించగా, మళ్లీ గుంతలోకి నెట్టారు. దీంతో వారు షాక్ కు గురయ్యారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన ఔత్సాహికులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది.

  • Loading...

More Telugu News