: సాక్షిపై సెక్షన్ 153ఏ, 505 సెక్షన్ల కింద కేసు నమోదు


సాక్షి దినపత్రికపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ, ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన వేళ, ప్రజలను రెచ్చగొట్టేలా సాక్షి పత్రికలో కథనాలు, చిత్రాలు ప్రచురితమైనాయని ఓ ఫిర్యాదు అందగా, దీనిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కొందరు వ్యక్తులు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 153ఏ, 505ల కింద, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అభ్యంతరకర విషయాలు ప్రచురించడం వంటి ఆరోపణలను నమోదు చేశారు. కేసును విచారిస్తామని, న్యాయ సలహా తీసుకుని ముందడుగు వేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News