: విశాఖ సదస్సు సక్సెస్ అయింది: బ్రిక్స్ దేశాల ప్రతినిధులు
విశాఖపట్టణం వేదికగా విద్యుత్ ఆదా, విద్యుత్ సమర్థ నిర్వహణ అంశాలపై నిర్వహించిన సదస్సు విజయవంతమైందని 'బ్రిక్స్' దేశాల ప్రతినిధులు తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం వారు మాట్లాడుతూ, మాస్కోలో జరిగిన అవగాహన ఒప్పందంపై ఈ సదస్సులో చర్చించామని అన్నారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై అక్టోబర్ లో జరిగే సదస్సులో తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. విశాఖలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చిన తీరును బ్రిక్స్ దేశాల ప్రతినిధులు అభినందించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధులు, ఆయా దేశాల్లో విద్యుత్ పొదుపు దిశగా వచ్చిన మార్పులపై చర్చించారు.