: తనను తాను వెయిటర్ తో పోల్చుకున్న అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తనను తాను హోటల్ వెయిటర్ తో పోల్చుకుని అందర్నీ ఆశ్చర్యపరచాడు. మామూలుగా అమీర్ ఖాన్ ఆచి తూచి మాట్లాడతాడని పేరు. అలాంటి అమీర్ ఖాన్ ఈమధ్య కాలంలో చిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. 'దంగల్' సినిమా పోస్టర్ లాంఛ్ సందర్భంగా అమీర్ పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, సల్మాన్, షారూఖ్ లతో తనన తాను పోల్చుకోనని అన్నాడు. వాళ్లిద్దరూ సూపర్ స్టార్లని అన్నాడు. వారిద్దరిలో ఎవరైనా ఇలా హాల్ లోపలికి ఎంటరైతే స్టార్ వస్తున్నాడని భావిస్తారని, తాను ఎంటరైతే హోటల్ వెయిటర్ లా చూస్తారని అమీర్ తెలిపాడు. వెయిటర్ లను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదు కానీ, సైలెంట్ గా ఉంటారని చెప్పడమే తన ఉద్దేశ్యమని ఆయన చెప్పాడు. వాళ్లిద్దరి స్థాయి తనకు లేదని, వారిద్దరూ స్టార్లని అమీర్ అన్నాడు. వాళ్లిద్దరూ కలిసిపోవడం ఆనందదాయకమని పేర్కొన్నాడు.