: ఈద్ పండుగ ఏర్పాట్లలో ముస్లిం సోదరులు.. హలీం కేంద్రాలు, దుకాణాల్లో కొనుగోళ్ల సందడి
ముస్లిం సోదరులు ఈద్ పండుగ ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఎటు చూసినా మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. కొనుగోళ్లతో ముస్లిం సోదరులు తీరిక లేకుండా గడుపుతున్నారు. రంజాన్ రోజున పేదలకు దానం ఇవ్వాలన్న ఆనవాయతీని పాటించడానికి వారు సిద్ధమవుతున్నారు. నెలవంక కనబడిన తర్వాత ఉపవాస దీక్షల ముగింపు ఉంటుంది. పండుగ నేపథ్యంలో భారత్లో హిందూ, ముస్లింల ఐక్యత వెల్లివిరిసింది. హలీం కేంద్రాలు, దుకాణాల్లో కొనగోళ్లు భారీగా కొనసాగుతున్నాయి. పవిత్ర పండుగకు మసీదులు ముస్తాబయ్యాయి. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.