: వీణా-వాణిల ఆపరేషన్‌కు సుముఖత వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. దేవుడిపైనే భారం వేస్తున్నామని వ్యాఖ్య
అవిభక్త కవలలు వీణా-వాణిల ఆపరేషన్‌కు వారి తల్లిదండ్రులు ఈరోజు సుముఖత వ్యక్తం చేశారు. ప్రమాదం ఉన్నప్పటికీ ఆపరేషన్ ప్రక్రియ మొదలు పెట్టడానికి తాము ఒప్పుకుంటున్నట్లు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వారు చెప్పారు. దీనికి సంబంధించి అంగీకార పత్రాన్ని వారు ఈరోజు ఆసుపత్రిలో అందించారు. దేవుడిపైనే భారమంతా వేసి తాము ముందుకు వెళుతున్నట్లు వీణా-వాణిల తల్లిదండ్రులు మీడియాకి చెప్పారు. తమ చిన్నారులకు ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించాల్సిందిగా కోరారు. తల్లిదండ్రులు ఇచ్చిన లేఖ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.