: ఇందిరా పార్క్ వద్ద హైకోర్టు విభజన కోసం ధర్నా.. భారీగా చేరుకుంటోన్న న్యాయవాదులు
తెలంగాణలో తమ డిమాండ్ల సాధన కోసం న్యాయవాదులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో పాల్గొనడానికి భారీగా న్యాయవాదులు ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు విభజన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారులు, ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని అన్నారు. జడ్డిల ఆప్షన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను సాధించేవరకు ఆందోళనను కొనసాగిస్తూనే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.