: మీడియా ముందుకు నటి నీతూ అగర్వాల్... అకారణంగా బంధువులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
నటి నీతూ అగర్వాల్ గుర్తుందా? రెడ్ శ్యాండల్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లొచ్చిన నటి. ప్రస్తుతం బెయిలుపై బయటున్న నీతూ అగర్వాల్ ఈ ఉదయం మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధాలూ లేని తన బంధువులను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. కడప, ప్రొద్దుటూరు పోలీసులు అకారణంగా తన ముగ్గురు బంధువులను అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం నీతూ హైదరాబాద్ లోని బీరంగూడ ప్రాంతంలో తన బంధువుల ఇంట ఉంటోంది.