: ప్రయాణికుడికి గుండెపోటు.. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి సౌదీ అరేబియా బయలుదేరిన ఓ విమానం ఈరోజు ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చిందని, అందుకే విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. విమానాన్ని ల్యాండ్ చేసిన వెంటనే గుండెపోటుతో బాధపడుతోన్న ప్రయాణికుడిని సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.