: కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొత్తం 19 మంది కేంద్ర సహాయ మంత్రులను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఒక్క ప్రకాష్ జవదేకర్ కు మాత్రమే ప్రమోషన్ లభించింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో జరుగగా, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రకాశ్ కేశవ్ జవదేకర్ (సహాయ మంత్రి నుంచి క్యాబినెట్ హోదా)తో ప్రమాణ స్వీకారం ప్రారంభం కాగా, ఫగ్గస్ సింగ్ కులస్తే (మాండ్లా), ఎస్ఎస్ అహ్లూవాలియా (డార్జీలింగ్), రమేష్ చందప్ప జిగజినాగి (బీజాపూర్), విజయ్ గోయల్ (రాజ్యసభ సభ్యుడు), రామ్ దాస్ అత్వాలే (రాజ్యసభ సభ్యుడు), రాజెన్ గోహెన్ (నాగావ్)లు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు అనిల్ మాధవ్ దవే (రాజ్యసభ సభ్యుడు), పురుషోత్తమ్ గోడాభాయ్ రూపాలా (రాజ్యసభ సభ్యుడు), ఎంజే అక్బర్ (రాజ్యసభ సభ్యుడు), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనీర్), జస్వంత్ సిన్హ్ భాభోర్ (దాహోద్), డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే (చందౌలీ), అజయ్ టంటా (అల్మోరా), కృష్ణారాజ్ (షాజహాన్ పూర్), మన్సుఖ్ భాయ్ మందావియా (రాజ్యసభ సభ్యుడు), అనుప్రియా సింగ్ పటేల్ (మీర్జాపూర్), సీఆర్ చౌదరి (నాగౌర్), పీపీ చౌదరి (పాలీ), శుభాష్ రామ్ రావ్ భామ్రే (ధూలే)లు ప్రమాణం చేశారు.