: తీవ్ర అస్వస్థతకు గురైన హీరో సుదీప్
కన్నడ హీరో, 'ఈగ'తో టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కన్నడలో తెరకెక్కుతోన్న 'హెబ్బులి' సినిమా షూటింగ్ సమయంలో ఆయన అనారోగ్యం పాలయ్యారు. మూడు రోజుల క్రితం షూటింగ్ వున్న సుదీప్ అస్వస్థతకు గురయ్యారని, ఆయనకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని హెబ్బులి చిత్ర బృందం మీడియాకు తెలిపింది. నిన్న సుదీప్ ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. ప్రస్తుతం సుదీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సుదీప్ గ్యాస్ట్రిక్ సమస్యవల్ల అస్వస్థతకు గురయ్యాడని వైద్యులు తమకు తెలిపినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపింది. కొన్ని రోజుల పాటు తమ చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్నట్లు పేర్కొంది.