: మోదీ టీంలో ఎంజే అక్బర్, అర్జున్ రామ్ మేఘ్వాల్


మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన అనిల్ మాధవ్ దవేతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గుజరాత్ ఎంపీ, అక్కడి బీజేపీ నేత పురుషోత్తమ్ గోడాభాయ్ రూపాలా మంత్రిగా ప్రమాణం చేశారు. జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ ఎంజే అక్బర్, లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ గా ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్, గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ ఎంపీ జస్వంత్ సిన్హ్ భాభోర్, ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ బీజేపీ ఎంపీ డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే, ఉత్తరాఖండ్ లోని అల్మోరా నుంచి 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీ అజయ్ టంటా, ఉత్తరప్రదేశ్, షాజహాన్ పూర్ బీజేపీ ఎంపీ కృష్ణారాజ్ ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News