: దర్బార్ హాల్ కు వచ్చిన ప్రధాని... కాసేపట్లో మంత్రుల ప్రమాణం
వచ్చే సంవత్సరంలో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో, నరేంద్ర మోదీ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో ప్రారంభమైంది. దర్బార్ హాల్ లో తక్కువ సంఖ్యలో కేవలం ఆహూతులకు మాత్రమే ప్రవేశం కల్పించిన ఈ కార్యక్రమానికి కొద్ది సేపటి క్రితం ప్రధాని మోదీ వచ్చారు. రాష్ట్రపతి రాక కోసం వేచి చూస్తున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, మేనకా గాంధీ, నితిన్ గడ్కరీ, రాజ్ వర్థన్ సింగ్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చాక, జనగణమన గీతాలాపన తరువాత మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.