: ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజుల‌ను ఖ‌రారు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం... వెబ్ సైట్లో పూర్తి వివరాలు


తెలంగాణలో ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ఫీజుల‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖ‌రారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ జారీ చేసింది. మొత్తం 179 క‌ళాశాల‌ల‌కు ఫీజులు ఖ‌రారు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. సీబీఐటీ కళాశాలకు గ‌రిష్ఠంగా ఫీజు రూ.1,13,500గా ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఫీజులకు సంబంధించిన పూర్తివివరాలను https://tseamcet.nic.in లో పొందుపరచారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలంటూ గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళనను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు.

  • Loading...

More Telugu News