: పదవి కోసం మోదీని దేబిరించడం లేదు: ఉద్ధవ్ థాకరే


నేడు జరగనున్న క్యాబినెట్ విస్తరణలో తమకు పదవులు కావాలని నరేంద్ర మోదీని తామేమీ దేబిరించలేదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. "మాది ఆత్మ గౌరవమున్న పార్టీ. ఏదైనా గౌరవంగా రావాలి. దేనికోసమో అడుక్కోబోము" అని ఆయన అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవి కోసం తమ పార్టీ ఎవరితోనూ చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. క్యాబినెట్ పదవులు తమకు ప్రాధాన్యతాంశం కాదని, వాటి కోసం ఎవరి తలుపుల వద్దనో నిలబడబోమని అన్నారు. కాగా, ప్రస్తుతం శివసేన నుంచి అనంత్ గీతే మాత్రమే మోదీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఈ దఫా విస్తరణలో మరో పదవి లభిస్తుందన్న వార్తలు ఆది నుంచి వినిపించినప్పటికీ, బీజేపీ వర్గాల నుంచి వచ్చిన లీకుల ప్రకారం, శివసేనకు స్థానం దక్కబోదని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News