: పదవులు అక్కర్లేదు!... రాష్ట్రానికి నిధులిస్తే చాలు!: మోదీకి తేల్చిచెప్పిన చంద్రబాబు!


నేటి ఉదయం జరగనున్న కేంద్ర కేబినెట్ లో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు దక్కేవే. అయితే కేంద్ర మంత్రి పదవులను తీసుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుుడు ససేమిరా అన్నారు. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. వారిలో ఒకరు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కాగా, మరొకరు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి. అయితే నేడు జరగనున్న కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు దక్కే ఛాన్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ అందుకు ససేమిరా అన్న చంద్రబాబు... అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకే నేరుగా చెప్పేశారు. ఆర్థిక చిక్కుల్లో ఉన్న నవ్యాంధ్రకు సరిపడినన్ని నిధులివ్వాలని కోరిన ఆయన తమ పార్టీకి మరిన్ని మంత్రి పదవులు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆ విధంగా మంత్రి పదవులను వద్దన్న చంద్రబాబు... ఏపీకి నిధుల విషయంలో కాస్తంత ఒత్తిడి పెంచడంలో సఫలీకృతులైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News