: పేలుళ్లతో మరోమారు దద్దరిల్లిన సౌదీ... ఐఎస్ వరుస దాడులు, పలువురి మృత్యువాత


మొన్న ఉన్నట్టుండి జరిగిన పేలుళ్లతో వణికిపోయిన సౌదీ అరేబియా తాజాగా నిన్న కూడా వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ తాజా దాడుల్లో పలువురు చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని మదీనా మసీదు లక్ష్యంగా విరుచుకుపడిన ఐఎస్ ఉగ్రవాదులు అక్కడి సెక్యూరిటీ కార్యాలయానికి చెందిన పార్కింగ్ లో ఆత్మాహుతి దాడి చేశారు. మసీదునే లక్ష్యంగా చేసుకుని రంజాన్ మాసంలో రోజూ విడిచే ఉపవాస దీక్షా సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఆరుగురు చనిపోయారు. మరోవైపు అదే దేశంలోని ఖాతిఫ్ నగరంలోని మసీదు వద్ద, ఆత్మాహుతి దాడి, కారు బాంబు పేలుడు సంభవించాయి. జెద్దాలోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా మరో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. వరుస బాంబు పేలుళ్లతో సౌదీ అరేబియా నిన్న వణికిపోయింది.

  • Loading...

More Telugu News