: శ్రీకాకుళంలో కంపించిన భూమి.... భయంతో పరుగులు పెట్టిన జనం


నవ్యాంధ్రను భూకంపాలు భయపెడుతున్నాయి. మొన్నటిదాకా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 30 సార్లకు పైగా అక్కడ భూమి కంపించింది. తాజాగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోనూ నేటి తెల్లవారుజామున భూమి కంపించింది. జిల్లాలోని పొందూరు మండల పరిసరాల్లో నేటి తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో రెండు సార్లు భూమి కంపించింది. క్షణాల వ్యవధిలోనే రెండు పర్యాయాలు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News