: ఇకపై స్నాప్ డీల్ లో విమాన, బస్సు టికెట్లు
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ ఇకపై విమాన, బస్ టిక్కెట్లను కూడా విక్రయించనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు సేవలందించేందుకు సన్నాహాలు ప్రారంభించామని చెప్పిన స్నాప్ డీల్, విమాన, బస్ టికెట్ల విక్రయ మార్కెట్లోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. 'క్లియర్ ట్రిప్' భాగస్వామ్యంతో విమాన టికెట్లను, 'రెడ్ బస్' సహకారంతో బస్ ప్రయాణ టిక్కెట్లను విక్రయించనున్నట్టు స్నాప్ డీల్ తెలిపింది. వీటితో పాటు ఆహార విక్రయాలను కూడా అందించనున్నామని, 2020 నాటికి స్నాప్ డీల్ ద్వారా అందిస్తున్న ఆన్ లైన్ వ్యాపారం విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని సీఈవో రోహిత్ బన్సాల్ తెలిపారు.