: కూల్చిన గుళ్లను తిరిగి కట్టిస్తాం...సంయమనం పాటించండి: చంద్రబాబు
గుళ్ల తొలగింపు వ్యవహారంలో అంతా సంయమనం పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. విజయవాడలో దుర్గఘాట్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధికి అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూల్చిన గుళ్లను తిరిగి నిర్మిస్తామని ఆయన తెలిపారు. అన్ని మతాలకు చెందిన ప్రజల మనోభావాలు తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని, కూల్చివేసిన గుళ్లను గతంలో ఉన్నదాని కంటే గొప్పగా నిర్మిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్ లో ఆలయాలు తొలగించాల్సి వస్తే ఆలయ కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, శాస్త్రోక్తంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.