: హెయిర్ కటింగ్ ఫోటోను చూసి ధోనీని రజనీకాంత్ తో పోలుస్తున్న అభిమానులు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తమిళ అభిమానులు నిరాడంబరతలో 'తలైవా' రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ధోనీ తాజాగా ఓ హెయిర్ కటింగ్ సెలూన్ లో కటింగ్ చేయించుకున్నాడు. ఆ ఫోటోను ధోనీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసి అభిమానులు ధోనీని ప్రశంసిస్తున్నారు. కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టే ఇలా సెలూన్ లో కూర్చుని జుట్టు కత్తిరించుకున్నాడని పేర్కొంటున్నారు. ధోనీకి అస్సలు ఇగో లేదని, చాలా సింపుల్ గా ఉంటాడని అభిమానులు కీర్తిస్తున్నారు. సింప్లిసిటీని అనుసరించడంలో రజనీకాంత్ తరువాత ధోనీయేనని ఇంకొందరు అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, వాస్తవానికి ధోనీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ సప్నా భావ్ నాని దగ్గర జుట్టు కత్తిరించుకుంటుంటాడు. ప్రతి సందర్భంలోనూ సందర్భానికి తగ్గట్టు ఆమె ధోనీ హెయిర్ కట్ డిజైన్ చేస్తుంటుంది. గత వరల్డ్ కప్ సందర్భంగా ధోనీకి ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో చెప్పాలంటూ సప్నా అభిమానులను కోరింది కూడా!