: కేబినెట్ విస్తరణలో మాకేంటి?...బీజేపీని నిలదీసిన శివసేన
మంత్రి వర్గ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నవేళ బీజేపీకి మహారాష్ట్రలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రల నేతలకు స్థానం కల్పించి, ఆ రాష్ట్రాల్లో పాగావేయాలని భావించిన బీజేపీ ఆశలపై మిత్రపక్షం శివసేన నీళ్లు చల్లేలా భావిస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో తమకేంటని? శివసేన ప్రశ్నించింది. కేబినెట్ విస్తరణపై వస్తున్న పుకార్లపై అసలు విషయాన్ని ఆ పార్టీ స్పష్టం చేయాలని శివసేన డిమాండ్ చేసింది. విస్తరణ చేపడితే శివసేనకు ఎన్ని పదవులిస్తారో చెప్పాలని ఈ పార్టీ నిలదీసింది. భాగస్వామ్యపక్షమైన శివసేన ఇలాంటి డిమాండ్ తెరమీదకు తేవడంతో బీజేపీ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.