: దేవుళ్ల విగ్రహాలను పట్టుకొని ఆలయాల కూల్చివేతపై విజయవాడలో కాసేపట్లో భారీ నిరసన ర్యాలీ
విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కాసేపట్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. 'అభివృద్ధి కన్నా ధర్మ పరిరక్షణే ముఖ్యం' అని నినదిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది. 13 జిల్లాలకు చెందిన సుమారు 40 మంది పీఠాధిపతులు, పలు ధార్మిక సంస్థల సభ్యులు, భక్తులు ర్యాలీలో పాల్గొననున్నట్లు సమాచారం. కెనాల్ రోడ్డులో ఉన్న వినాయక గుడి నుంచి నిరసన ర్యాలీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కూల్చేసిన దేవాలయాల్లోని దేవుళ్ల విగ్రహాలను చేతిలో పట్టుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించనున్నారు.