: యాక్టింగ్ స్కూళ్లు నడిపేవాళ్లంతా మోసగాళ్లే!: నసీరుద్దీన్ షా
యాక్టింగ్ సూళ్ల నిర్వహణపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ స్కూళ్ల పేరుతో నేర్పేది ఏమీ ఉండదని నసీరుద్దీన్ షా తెలిపారు. ఒక రకంగా చూస్తే యాక్టింగ్ స్కూల్ పేరుతో నిర్వహించేవన్నీ మోసాలేనని ఆయన తేల్చి చెప్పారు. 41 ఏళ్ల సినీ ప్రస్థానం కలిగిన నసీరుద్దీన్ షా హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ అర్టిస్టు... ఇలా విభిన్న పాత్రల్లో రాణించి, సహజ నటుడిగా నీరాజనాలందుకున్నారు. నటనపై ప్రేమ పెంచుకుంటే దానంతట అదే స్వీయ శిక్షణతో అబ్బుతుందని ఆయన తెలిపారు. నటనకు ఎక్కడా గురువులు ఉండరని ఆయన తెలిపారు. అలా నటనలో శిక్షణ ఇస్తున్నామని చెప్పే వారంతా ప్రజలను మోసం చేస్తున్నట్టేనని, అక్కడ వాళ్లు చెప్పేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.