: ఆదిలాబాద్‌లో విషాదం.. ఊయలలో ఊగుతుండగా తాడు చుట్టుకొని బాలుడి మృతి
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఊయల ఊగుతూ ప్రమాదవ శాత్తు రిషి అనే బాలుడు చనిపోయాడు. మెడకు ఊయల తాడు చుట్టుకోవడంతో ఆ బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు దండేపల్లి ఎంపీపీ మంజుల కుమారుడు. బాలుడికి 11 సంవత్సరాల వయసు ఉంటుందని సమాచారం. బాలుడి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.