: హైదరాబాద్ లో అణువణువునూ తనిఖీ చేస్తున్న భద్రతా దళాలు


హైదరాబాద్ నగరాన్ని పోలీసులు, భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శంషాబాద్ రహదారి, ఔటర్ రింగురోడ్డుపై మకాం వేసిన పోలీసులు నగరంలోకి వస్తున్న అన్ని వాహనాలనూ తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని పలు కూడళ్లలో సోదాలు నిర్వహిస్తూ, అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పట్టుబడటం, ఇదే సమయంలో పలు దేశాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది. సందర్శకులను విమానాశ్రయంలోనికి అనుమతించడం లేదు. మరో మూడు రోజుల్లో రంజాన్, ఆపై వెంటనే బోనాల పండగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News