: వైకాపాలో చేరిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నేత పూర్ణచంద్ర ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జ్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రసాద్ కు స్వాగతం పలికిన పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయనకు కండువా కప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పర్వత, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీపడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత కుమార్ రాజు, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జగన్ నేతృత్వంలో పనిచేసి వైకాపాను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.