: రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు, న్యాయవాదులకు మధ్య తోపులాట
హైకోర్టు విభజన, ఆప్షన్ల రద్దు, న్యాయవాదులు, ఉద్యోగులపై సస్పెన్షన్ అంశాలపై తెలంగాణలో న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ఎనిమిదవ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదులు తమ ఆందోళనను కొనసాగించారు. కోర్టులో విధులకు హాజరవుతోన్న న్యాయమూర్తులను న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టుకు వెళ్లవద్దని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాయవాదులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసుల సాయంతో న్యాయాధికారులు కోర్టులోకి వెళ్లినట్లు తెలుస్తోంది.