: చిక్కుల్లో ఓవైసీ!... మజ్లిస్ అధినేతపై సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు!


హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో భీకర దాడులకు పక్కా ప్లాన్ వేసి చివరి క్షణంలో పోలీసులకు చిక్కిన ఐఎస్ ఉగ్రవాదులకు న్యాయ సాయం అందిస్తానంటూ చేసిన ప్రకటన మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడ్డారు. ఓవైసీ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా హైదరాబాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఏకంగా ఓ ఫిర్యాదు నమోదైంది. ఓవైసీ వ్యాఖ్యలు ఐఎస్ ఉగ్రవాదులకు ఊపిరి నింపేలానే ఉన్నాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పెను విధ్వంసాలకు దిగుతున్న ఐఎస్ కు ఓవైసీ... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతున్నట్లే అర్థమవుతోందని ఆరోపించారు. ఇది జాతికి ద్రోహం చేయడమేనని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News