: నాందేడ్ లో హైదరాబాదీ ముష్కరుల ‘ఉగ్ర’ లింకులు!... నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ!


భాగ్యనగరి హైదరాబాదు సహా ఏపీ, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంస రచనకు పథకం వేసిన ఐఎస్ కు చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు అనుమతితో వీరిని తమ అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారి నుంచి నిజాలను కక్కిస్తున్నారు. ఈ క్రమంలో వారికి మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉగ్రవాద లింకులున్నాయని నిర్ధారించుకున్నారు. వెనువెంటనే రంగంలోకి దిగిన అధికారులు నిన్న రాత్రి నాందేడ్ ను జల్లెడ పట్టి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ చర్యలు చేపట్టింది.

  • Loading...

More Telugu News