: హైదరాబాద్‌లో విజృంభించిన జ్వరాలు.. ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతోన్న రోగులు
వర్షాకాలం ఆరంభంలో హైదరాబాద్‌లో జ్వరాలు విజృంభించాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగులు క్యూ కట్టారు. జ్వరాలతో అధిక సంఖ్యలో రోగులు అక్కడికి చేరుకుంటున్నారు. ఫీవర్ ఆసుపత్రి ఓపీ విభాగంలో గంటల తరబడి రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలనుంచే చికిత్స కోసం లైన్‌లో ఉన్నామని ఇంతవరకూ తమకు డాక్టర్ల దర్శనం దొరకలేదని రోగులు వాపోతున్నారు. క్యూలైన్‌లోనే కొందరు రోగులు సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. ఆసుపత్రిలో సౌకర్యాలు ఏ మాత్రం బాగోలేవని రోగులు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.