: మద్యం తాగి స్కూలుకొచ్చిన టీచర్!...గేటు బయటే నిలబెట్టిన గ్రామస్థులు!


అతడో ఉపాధ్యాయుడు. తాను పనిచేస్తున్న సర్కారీ విద్యాలయానికి వచ్చే బాలలను దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దడమే అతడిపై ఉన్న బాధ్యత. అయితే ఆ బాధ్యతను అతడు తుంగలో తొక్కేశాడు. పిల్లలకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అతడు దారి తప్పాడు. ఫుల్లుగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. బెంబేలెత్తిపోయిన పిల్లల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్థులు రంగంలోకి దిగారు. సదరు ‘మందు’ టీచర్ ను పాఠశాల గేటు బయటే నిలిపేశారు. ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేటి ఉదయం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News