: కుంబ్లే చెప్పాడు... కోహ్లీ, ధోనీ తబలా వాయించారు!
త్వరలో వెస్టిండీస్ పర్యటనకు ఇండియా బయలుదేరాల్సిన తరుణంలో జట్టులో సమష్టితత్వాన్ని మరింతగా పెంచేందుకు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆలోచన మేరకు ఓ వినూత్న కార్యక్రమాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో అందరినీ కూర్చోబెట్టి, తలా ఒక తబలా వంటి వాయిద్యాన్ని చేతికిచ్చింది. ఇక ప్రముఖ గాయని వసుంధరా దాస్ మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ, ప్లేయర్లను ఉత్సాహపరుస్తూ, వారితో లయబద్ధంగా తబలాలు వాయించేలా చేసింది. ఈ కార్యక్రమంలో ధోనీ, కోహ్లీలతో పాటు ఇతర ఆటగాళ్లు, కుంబ్లే, అతని సహాయకులు అందరూ పాల్గొన్నారు.